గ్లామర్ పరంగా ఇంతవరకూ ఆచి తూచి వ్యవహరించింది అందాల భామ అనుపమ పరమేశ్వరన్. అయితే, ఇప్పుడు కాస్త ఆ డోస్ పెంచింది. ‘టిల్లు స్క్వేర్’లో అనుపమ ఆవగా క్లీవేజ్ సోయగాలారేసేసింది.
అంతేకాదు, వేడి వేడిగా లిప్ లాకులు కూడా లాగించేసింది. ప్రమోషనల్ సాంగ్‌లోనే ఇంత చేసిన అనుపమ ఇక సినిమాలో ఇంకెంత చేసుంటుందా.? అని ‘టిల్లు స్క్వేర్’పై అంచనాలు పెంచేసుకుంటున్నారు అనుపమ అభిమానులు.
ఇదిలా వుంటే, ఈ సినిమా ప్రోమోతో జరిగిన హడావిడి చూసి, అనుపమకి ఓ ప్రముఖ యంగ్ హీరో తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట. కాస్త బోల్డ్‌గా వుండబోతోందట ఆ సినిమా.
తొలుత ఆ సినిమా కోసం రష్మికను అనుకున్నారట. అయితే, రష్మిక డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో, అనుపమని తీసుకోవాలనుకుంటున్నారట.
మొత్తానికి అనుపమ నయా గ్లామర్ అవతార్ భలే వర్కవుట్ అయ్యిందిలే. నెలాఖరుకల్లా ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.