ఇండియన్ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్ రూల్ సరికొత్త అధ్యాయం.. మరో చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా, ఇండియన్ నెంబర్‌వన్ ఫిల్మ్‌గా ‘పుష్ప-2’ దిరూల్ నిలిచిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం, భారతీయులు గర్వించదగ్గ చిత్రం ‘బాహుబలి-2’ వసూళ్లను పుష్ప-2 అధిగమించిన విషయం తెలిసిందే. ఇక పుష్ప-2 ది రూల్మరో సారి ఇండియా వైడ్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. ‘
జనవరి 11 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్.. పుష్ప-2కు మరో ఇరవై నిమిషాల పవర్ఫుల్ ఫుటెజ్‌ను యాడ్ చేస్తున్నారు. ది వైల్డ్‌ఫైర్ మరింత ఎక్స్ట్రా ఫైరీగా మారబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా మంగళవారం ప్రకటించారు మేకర్స్.ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల కలయికలో రూపొందిన పుష్ప-2 ది రూల్..ఈ సన్సేషన్ కాంబినేషన్లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది.
అల్లు అర్జున్ నట విశ్వరూపంకు, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే 32 రోజు వరకు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించిన తాజాగా ఈ చిత్రం కేవలం 32 రోజుల్లో 1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు సృష్ఠించింది. ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధించి రికార్డుల సాధించడంలో కూడా ఓ రికార్డును క్రియేట్ చేసింది.
ఈ చిత్రం యావత్ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా నెంబర్‌వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్లో ఉన్నాడు