RRR Malli: ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన మల్లి ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా?

RRR Malli: టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదల ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. దాదాపుగా 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి భారీగా గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మల్లి కూడా ఒకరు. గోండు పిల్లగా నటించిన మల్లీ పాత్ర సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. ఆ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా? సినిమా మొదలవడంతోనే కొమ్మ ఉయ్యాలా అంటూ పాట పాడుతూ ప్రేక్షకుల అలరించింది ఆ చిన్నారి.

ఆమె పేరు ట్వింకిల్ శర్మ. డాన్స్ ఇండియా షో ద్వారా పాపులర్ అయ్యింది ఈ చిన్నది. ట్వింకిల్ శర్మ చాలా టీవీ షోల్లో కనిపించింది. అలాగే ఎన్నో డాన్స్ షోలు కూడా చేసింది. వీటితో పాటు ఫ్లిప్ కార్డ్ యాడ్‌ లోనూ కనిపించింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైనప్పుడు ఆమె ఎనిమిదో తరగతి చదువుతుందట. సినిమా పూర్తయ్యే సమయానికి ఇంటర్ పూర్తయ్యింది. 2022 లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది.

ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందని అందరూ సోషల్ మీడియాలో సర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆ సినిమాలో అంత చిన్నగా నటించిన అమ్మాయి అప్పుడే అంత పెద్దగా మారిపోయిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ సినిమాలో అంత సింపుల్ గా కనిపిస్తూ అమాయకంగా కనిపించిన ట్వింకిల్ ఇప్పుడు ఈ విధంగా కాస్త గ్లామర్ ఫోటోస్ షేర్ చేయడంతో నేటిజన్స్ సైతం అవాక్కవుతున్నారు.