Sankranthi Movies: ఈ సంక్రాంతి టాలీవుడ్‌కు చాలా స్పెషల్‌గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్,’ నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్,’ విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో బరిలోకి దిగుతున్నారు. మూడు సినిమాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ పాజిటివ్ బజ్ సొంతం చేసుకోగా, ‘డాకు మహారాజ్’ పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకుని రూపొందుతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది.
గతంలో ఈ ముగ్గురు హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం 2019లో చూశాం. అప్పుడు ‘వినయ విధేయ రామా,’ ‘కథానాయకుడు,’ ‘ఎఫ్2’ సినిమాలు సంక్రాంతి బరిలో విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాల్లో ‘ఎఫ్2’ మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచింది. మిగిలిన రెండు సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందా లేక ఈసారి ముగ్గురు హీరోలూ విజయం సాధిస్తారా అనేది ఆసక్తిగా మారింది.
‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదలవుతుండగా, ‘డాకు మహారాజ్’ జనవరి 12న, ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ మూడు సినిమాల్లో రెండు దిల్ రాజు నిర్మించినవే కావడం విశేషం. బాలయ్య సినిమా నైజాం హక్కులు కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూడు సినిమాలు కలెక్షన్ల పరంగా ఎలా రాణిస్తాయోనని పరిశ్రమ వర్గాలు గట్టిగా ఫోకస్ చేశాయి. రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఈ సినిమాతో తన మార్కెట్ స్ధాయిని నిరూపించుకోవాలని చూస్తుండగా, బాలయ్య హ్యాట్రిక్ హిట్స్‌ను కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక వెంకటేష్ తన విజయ పరంపరను కొనసాగించాలని భావిస్తున్నారు. మరి ఈ సంక్రాంతి బరిలో ఎవరు బాక్సాఫీస్ కింగ్‌గా నిలుస్తారో చూడాల్సిందే.