Ajay Devgn: మామూలుగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ఆడియో రిలీజ్ ఈవెంట్ లు విడుదల అవుతున్నాయి అంటే హీరో హీరోయిన్లతో పాటు డైరెక్టర్లు నిర్మాతలు అలాగే కొంతమంది మూవీ మేకర్స్ వస్తూ ఉంటారు. సినిమాలో నటించిన నటీనటులు సాంకేతిక నిపుణులు కూడా వస్తూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని సార్లు సినిమాలలో ఏవైనా జంతువులు ముఖ్యపాత్ర పోషిస్తే వాటిని కూడా తీసుకువస్తూ ఉంటారు. అలా ఇప్పటికే గతంలో చాలా సార్లు జంతువులను అలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఉదాహరణకు చార్లీ సినిమాను తీసుకోవచ్చు. ఈ సినిమాలో నటించిన డాగ్ ని ప్రీ ఈవెంట్ కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక బాలీవుడ్ హీరో సినిమా ఈవెంట్ కు ఏకంగా గుర్రాన్ని తీసుకొచ్చారు. ఆ హీరో మరెవరో కాదు అజయ్ దేవగన్. కాగా అజయ్ దేవగణ్, అమన్ దేవగణ్, రాషా తడాని, డయానా పెంటి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా ఆజాద్. RSVP మూవీస్ బ్యానర్ పై అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. స్వతంత్రం ముందు కథతో, ఒక ప్రేమకథ, ఒక గుర్రాన్ని నడపడానికి హీరో పడే కష్టంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో గుర్రం చాలా ముఖ్య పాత్ర పోషించింది. దీంతో నిన్న ఆజాద్ సినిమా ట్రైలర్ లాంచ్ జరగ్గా ఈవెంట్ కి సినిమాలోని గుర్రాన్ని తీసుకొచ్చారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఈ సినిమాలో నటించిన గుర్రాన్ని తీసుకొచ్చి స్టేజి ఎక్కించారు.
అజయ్ దేవగణ్ తో పాటు మూవీ యూనిట్ కూడా ఆ గుర్రంతో ఫొటోలు దిగారు. స్టేజిపై ఇలా గుర్రాన్ని తీసుకొచ్చి సినిమా ప్రమోషన్స్ చేయడంతో ఈ ఈవెంట్ బాగా వైరల్ అయింది. ఆ గుర్రానికి సంబంధించి ఈవెంట్ వీడియోలు, మూవీ యూనిట్ గుర్రంతో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు ఫోటోలపై ఇది చాలా కొత్తగా ఉంది డిఫరెంట్ గా ఉంది అంటూ కొందరు స్పందిస్తుండగా, గుర్రాన్ని అలా స్టేజి పైకి తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం అంటూ కొనియాడుతున్నారు. ఈ సినిమా జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.