Ajith Accident: హీరో అజిత్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు ప్రొఫెషనల్ రేసర్ అన్న విషయం కూడా తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే సమయం దొరికినప్పుడల్లా కార్ల రేసులో పాల్గొంటూ ఉంటారు. అలాగే బైక్ లో కార్లు వంటి వాటిలో లాంగ్ జర్నీ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా అజిత్ దుబాయ్ గ్రాండ్ ప్రీలో పాల్గొనేందుకు ఇటీవల అక్కడకు వెళ్లారు. రేస్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన కారు గోడను బలంగా ఢీ కొట్టింది. దాంతో, కారు ముందు భాగం భారీగా డ్యామేజ్ అయింది. అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆయన్ను మరో కారులోకి తరలించింది.
సంబంధిత వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ నెల 11, 12న దుబాయ్ వేదికగా 24H కారు రేసు జరగనుంది. రేసింగ్ అంటే అజిత్ కు మహా ఇష్టం. సినిమా చిత్రీకరణ నుంచి బ్రేక్ దొరికితే చాలు బైక్స్, కార్లతో చక్కర్లు కొడుతుంటారనే సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం గంటకు 234 కిలో మీటర్ల వేగంతో ఆయన కారును డ్రైవ్ చేశారు. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయింది. మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అజిత్ ఒక స్టార్టప్ ను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకూ బైక్ పై వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.
#Ajith survived the car accident without injury !! pic.twitter.com/YtixKk9dlH
— Ayyappan (@Ayyappan_1504) January 7, 2025
ఇక తాజాగా జరిగిన యాక్సిడెంట్ లో ఆయనకు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. తృటిలోనే పెను ప్రమాదం తప్పింది. ఆ కారు డ్యామేజ్ అవ్వడం చూసి అజిత్ కు భారీగా దెబ్బలు తగలగానే అనుకున్నారు. కానీ ఆయనను భద్రత సిబ్బంది సేఫ్ గా బయటకు తీయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా అజిత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నారు. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న విదా ముయార్చి సినిమా సంక్రాంతికి రావాల్సి ఉండగా వాయిదా పడింది. అలాగే అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.