Tollywood: వంద కోట్లు ఇచ్చిన అలాంటి పని చేయను.. ఎన్టీఆర్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

Tollywood: సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అని చాలామంది ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో రాణించడం అన్నది అంత సులువైన విషయం కాదని చెప్పాలి. అదృష్టం అందం అభినయం ఇవన్నీ ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇక సినిమా సినిమాకు వెరియేషన్స్ ని చూపిస్తూ దూసుకుపోతున్న హీరోయిన్లు కూడా చాలా మందే ఉన్నారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలా అయినా నటించడానికి కొంతమంది భామలు రెడీ అవుతున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం కోట్లు ఇచ్చిన కొన్ని పాత్రలు చేయము అని తెగేసి చెప్తున్నారు. అటువంటి వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు.

తాజాగా కూడా ఒక హీరోయిన్ 100 కోట్లు ఇచ్చినా సరే ఆ పని చేయను అంటూ తెగేసి చెప్పింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అమీషాపటేల్. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగులో క్రేజీ సినిమాల్లో నటించింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి బడా హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది అమీషా. ఆ తర్వాత తిరిగి బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడు సినిమాల స్పీడ్ చాలా వరకు తగ్గించింది. మొన్న ఈ మధ్య గదర్ 2 సినిమాతో భారీ హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది.

ఇదిలా ఉంటే అమీషా పటేల్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో ఆమె మాట్లాడుతూ.. వందల కోట్లు ఇచ్చిన ఒక పాత్ర మాత్రం చేయను అని చెప్పింది. అయితే అమీషా పటేల్ అత్త పాత్రలో కనిపించడానికి ఒప్పుకోలేదు అని కామెంట్స్ చేశాడు. దానికి ఆమె కౌంటర్ ఇస్తూ.. ఏ పాత్ర చేయాలి, ఏ పాత్ర చేయకూడదు అనే క్లారిటీ నాకు ఉంది. మీరంటే నాకు గౌరవం ఉంది. వందకోట్లు ఇచ్చినా కూడా నేను అత్త పాత్రలు చేయను అని చెప్పుకొచ్చింది. ఈ వాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.