Pushpa 2: అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో ఇటీవల తెరకెక్కిన చిత్రం పుష్ప 2. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి నెలరోజులు దాటింది. ఇప్పటికే ఎన్నో రికార్డులను సృష్టించింది. బాహుబలి 2 ఇలాంటి రికార్డులను సైతం బద్దలు కొట్టింది. దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఇప్పటికే నెల రోజులు అవ్వగా నార్త్ లోతప్ప ఆల్మోస్ట్ అన్నిచోట్లా పుష్ప 2 థియటర్స్ లో నుంచి మెల్లిగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరో రెండు రోజుల్లో సంక్రాంతికి సినిమాలు రానున్నాయి.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ జనవరి 10న, బాలకృష్ణ డాకు మహారాజ్ జనవరి 12న, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రానున్నాయి. ఇప్పటికే థియేటర్స్ అన్ని ఈ మూడు సినిమాలకు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం కూడా మొదలయింది. ఒక్కో సినిమాకు రెండు రోజులు గ్యాప్ ఉంది కాబట్టి దేనికి ఇబ్బంది లేకుండా థియేటర్స్ ఇచ్చి కలెక్షన్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో సంక్రాంతి సినిమాలకు సడెన్ గా పుష్ప 2 షాక్ ఇచ్చింది పుష్ప 2 సినిమా. అదేమిటంటే ఈ సినిమాలో మరో 20 నిముషాలు సీన్స్ జతచేసి మళ్ళీ జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
దీంతో ఈ వార్త టాలీవుడ్ లో చర్చగా మారింది. అసలు సంక్రాంతి సినిమాలు ఉన్న సమయంలో దీనికి థియేటర్స్ ఎలా ఇస్తారు అని పలువురు అంటుంటే, అసలే మూడు గంటల సినిమా నిడివి తగ్గించాల్సింది పోయి మళ్ళీ ఇంకో 20 నిముషాలు జతచేయడం అవసరమా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు చూసిన సినిమానే కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు కావాలనే సంక్రాంతి బరిలోకి ఈ సినిమా నిలుస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై మిగతా మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.