Revanth Reddy: సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి సినీ పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా తమ గుప్పట్లో పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే వారి సినిమాలకు ఇష్టానుసారంగా టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా బెనిఫిట్ షోలను కూడా అమలు చేస్తూ వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం సినీ పెద్దలకు ఇటీవల ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈయన పుష్ప సినిమా విడుదల సమయంలో జరిగిన సంఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు.
ఈ క్రమంలోనే తాను ముఖ్యమంత్రిగా ఉనన్ని రోజులు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవు అలాగే సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచనని తెగేసి చెప్పారు. దీంతో సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు ఒక్కసారిగా అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయనని తప్పు పట్టారు.. అల్లు అర్జున్ ఈగో కారణంగానే నేడు ఇండస్ట్రీ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది అంటూ కొందరు డైరెక్ట్ గా అల్లు అర్జున్ పై విమర్శలు కురిపించారు.
ఇది ఊహించని సంఘటన కావడంతో సినిమా పెద్దలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పించాలనే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటారని తెలిపారు. ఇక త్వరలోనే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో దిల్ రాజు ఆంధ్రప్రదేశ్లో తన సినిమాలకు భారీగా టికెట్ల రేట్లలో పెంచుకున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రితో కూడా కలిసి మరోసారి టికెట్ల రేట్లు పెంచే విషయంపై మాట్లాడతానని ఆయన ఇటీవల వెల్లడించారు.
ఇలాంటి తరుణంలోనే మరో నిర్మాత నాగ వంశీ నోటి దూల కారణంగా సీఎం రేవంత్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా నాగ వంశీ నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా కూడ జనవరి 12న విడుదల కాబోతుంది అయితే తెలంగాణలో సినిమా టికెట్లు పెంచకపోయిన మాకేం పర్వాలేదు మేము టికెట్ల రేట్లు పెంచమని ఎవరిని వెళ్లి అడగలేదని టికెట్ల రేట్లు పెంచకపోయిన మా సినిమా ఆడుతుంది అంటూ ఈయన చేసిన కామెంట్లతో మరోసారి ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.