Daaku Maharaj: టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు దర్శకుడు బాబీ. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డాకూ మహారాజ్ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ అందరి దృష్టి ఆకర్షించింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే బాలకృష్ణ సరసన ముగ్గురు ముద్దు గుమ్మలు నటిస్తున్నారు.
డాకూ మహారాజ్ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ లతో పాటు బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌతేలా కూడా నటిస్తోంది. ఊర్వశి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న బ్యూటీ అన్న విషయం తెలిసిందే. అలాగే తెలుగులో ఈ చిన్నది స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది. ఇప్పటికే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి ఈ సినిమాలో కీలక పాత్ర కూడా పోషిస్తుందని తెలుస్తోంది. డాకూ మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతేలా పోలీస్ ఆఫిసర్ గా కనిపించనుందట. అలాగే బాలయ్యతో ఒక స్పెషల్ సాంగ్ లోనూ మెరుస్తుంది ఈ అమ్మడు. ఇప్పటికీ ఆ పాటను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం ఊర్వశి తీసుకున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఊర్వశి, చిరంజీకి హీరోగా నటించిన ఈ సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది ఈ అమ్మడు. ఇప్పుడు ఉర్వశికి తన సినిమాలో నటించే ఛాన్స్ కూడా ఇచ్చాడు బాబీ. కాగా బాలయ్య బాబు సినిమాలో నటించినందుకు ఊర్వశి ఏకంగా రెండున్నర కోట్లు రూపాయిలు రెమ్యునరేషన్ అందుకుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.