VD14: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆలరిస్తున్నారు. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ.. అందులో భాగంగానే చివరగా ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.
దీంతో ఎలా అయిన తన తదుపరి సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తున్నారు విజయ్ దేవరకొండ. అందుకోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా రాహుల్, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. VD14 వర్కింగ్ టైటిల్‌తో రూపొందబోతున్న ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం అజయ్, అతుల్ సంగీతాన్ని అందించబోతున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాకు వారైతే బాగుంటుందని రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఫిబ్రవరి ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని మార్చిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని భావించినా అదే సమయంలో పవన్ కళ్యాణ్ మూవీ రాబోతున్న నేపథ్యంలో విడుదల వాయిదా వేయబోతున్నారు. విడుదలకు ఎలాగూ సమయం ఉండటంతో షూటింగ్ మెల్లగా చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో చేయబోతున్నారు.