మనలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధ పడుతూ ఉంటారు. శరీరంలో హిమోగ్లోబిన్ పెరిగితే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొన్ని ఆహారాలు తినడం ద్వారా సులభంగానే రక్తహీనత సమస్య దూరమవుతుంది. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో కనిపించే ఐరన్ రిచ్ ప్రోటీన్ కాగా శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గితే ఆయాసం, శ్వాస సంబంధిత సమస్యలు, రక్తహీనత, ఆకలి లేకపోవడం, ఇతర లక్షణాలు కనిపిస్తాయి.
బచ్చలికూర తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల స్థాయిని పెంచడంలో ఈ కూర సహాయపడుతుంది. ఖర్జూరం తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. ఖర్జూరం తీసుకోవడం వల్ల ఐరన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ లభించే ఛాన్స్ ఉంటుంది. ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.
వేర్వేరు రకాల మినుములను తినడం వల్ల కూడా హిమోగ్లోబిన్, సీరం ఫెర్రిట్రిన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి ఐరన్ లోపాన్ని తగ్గించడంలో తోడ్పడతాయి. నువ్వులు తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నువ్వులు తీసుకోవడం వల్ల ఐరన్, ఫోలేట్, కాపర్, ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయని చెప్పవచ్చు.
జామకాయ తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుందని చెప్పవచ్చు. తమలపాకులు, వేరుశెనగ, చింతపండు, ములగ ఆకులు, మామిడి, ఎండిన ఆఫ్రికాట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా రక్తహీనత సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంది.