KTR: కేటీఆర్ కి ఏసీబీ ఇచ్చినది నోటీసులా లేదు….. మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు!

KTR: ఫార్ములా ఈ కార్ రేస్ ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసిబి నోటీసులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులపై సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్పందిస్తూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అసలు కేటీఆర్ కు ఏసీబీ ఇచ్చినది నోటీసుల లేదని అందులో ఎలాంటి స్పష్టత లేదని ఈయన వెల్లడించారు. ఈ నోటీసులను క్షుణ్ణంగా పరిశీలించిన లక్ష్మీనారాయణ ఏకంగా మూడు అభ్యంతరాలను తెలియజేశారు.

కేటీఆర్‌కు ఏసీబీ ఇచ్చిన నోటీసును తాను పరిశీలించానని, దానిలో కేటీఆర్‌ను ఏ సెక్షన్‌ కింద పిలుస్తున్నారో పేర్కొనలేదని తెలిపారు. అది ఆయనకు నోటీసులను పంపించినట్టు లేదని ఏదో ఒక లెటర్ రాసినట్టు ఉందని తెలిపారు. ఈ నోటీసులను పూర్తిగా పరిశీలిస్తే ప్రశ్నించేందుకు, పత్రాలు సమర్పించేందుకు ఏసీబీ ముందు విచారణకు హాజరుకావాలని ఉన్నదని తెలిపారు. కేటీఆర్‌ నుంచి ఏదైనా డాక్యుమెంట్‌ తీసుకోవాలంటే ఆయనకు 94 బీఎన్‌ఎస్‌ఎస్‌ (91 సీఆర్‌పీసీ) కింద నోటీసులివ్వాలని, అవి లేవని లక్ష్మీనారాయణ తెలిపారు.

కేటీఆర్‌కు ఏసీబీ 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు తెలియజేశారు. ఏదైనా ఒక కేసు విషయంలో పూర్తి పరిజ్ఞానం కలిగిన వ్యక్తులను విచారణకు కనుక పిలిస్తే వారికి జారీ చేసే నోటీసులలో 179 బీఎన్‌ఎస్‌ కింద నోటీసులు ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుతం కేటీఆర్‌ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడు మాత్రమే అని, ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఉన్న నిందితుడికి 160 సీఆర్‌పీసీ కింద నోటీసులివ్వొద్దని తెలిపారు. ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ కేటీఆర్ కు పంపించిన నోటీసుల పట్ల చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.