కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయడం రాజకీయం పరంగా సంచలనంగా మారింది. లిబరల్ పార్టీ లో అంతర్గత విభేదాలు, ప్రజల మద్దతు తగ్గడం వల్లే ట్రూడో రాజీనామాకు సిద్ధపడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, కొత్త నాయకత్వం ఎవరింటి వైపుకు మళ్లుతుందో అన్నదానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఇప్పటికే లిబరల్ పార్టీలో నాయకత్వ మార్పు ప్రక్రియ ప్రారంభమైంది. అనితా ఆనంద్, జార్జ్ చాహల్ అనే భారతీయ సంతతి నేతల పేర్లు ప్రధానమంత్రి రేసులో వినిపిస్తున్నాయి. అనితా ఆనంద్ ట్రూడో మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. తమిళనాడు, పంజాబ్‌కు చెందిన ఆమె, కోవిడ్-19 సమయంలో చూపించిన సమర్థత వల్లే ప్రధానమంత్రి రేసులో ముందు వరుసలో నిలిచారు.
ఇక జార్జ్ చాహల్ కెనడాలోని సిక్కు కమ్యూనిటీలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. తాత్కాలిక నాయకుడిగా ఎంపికైనప్పటికీ, చట్టాల ప్రకారం ప్రధానమంత్రి పదవికి అర్హత ఉండదని స్పష్టంగా తెలియజేశారు. ఇది చాహల్ అవకాశాలను తగ్గించేలా కనిపిస్తున్నప్పటికీ, ఆయన అనుభవం, ప్రజల మద్దతు ఉండడం గమనార్హం.
ట్రూడో వారసుడిపై కెనడా ప్రజలు, అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుభవజ్ఞులైన నాయకుడు లేదా యువ నేత ఎవరైనా కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం కల్పిస్తుంది. కెనడా రాజకీయాల్లో ఈ మార్పు ఆ దేశ భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.