Vishal: హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మదగజరాజ. ఈ సినిమాకు దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా చాలా ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. అందులో భాగంగానే డైరెక్టర్ ఈ సినిమా నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. విశాల్ తో నాకు స్నేహం కుదరడం ఒక కథలాంటిది. నా భార్య ఖుష్బూ, విశాల్ మంచి స్నేహితులు. కానీ అతడితో నాకు పెద్దగా పరిచయం లేదు.
విశాల్ తో సినిమా చేస్తే బాగుంటుందని నేను, ఖుష్బూ ఒకసారి అనుకున్నాము. నిర్మాణ సంస్థ ద్వారా అతడితో మీటింగ్‌కు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. నా అసిస్టెంట్ రైటర్ తో కలిసి చెప్పిన చోటికి చేరుకునే క్రమంలో విశాల్ అక్కడ నుంచి బయటకు వెళ్తుండడం గమనించాం. కానీ, సీరియస్ గా తీసుకోలేదు. ఎవరినో విశాల్ లా ఊహించుకున్నావేమో అనుకుంటూ ఆఫీసుకు వెళ్లాము. కానీ అక్కడ విశాల్ లేడు. కోపంతో ఇంటికి తిరిగొచ్చాక ఖుష్బూకు జరిగిన సంగతి చెప్పాను. ఆమె విశాల్ ని సమర్థించింది. నేను కాల్ చేసి మాట్లాడతా అని అంటే వద్దు అని చెప్పాను. అది జరిగిన రెండు నెలల తర్వాత నేను వెళ్లిన ఒక సన్మాన కార్యక్రమానికి విశాల్ కూడా వచ్చాడు. అతడికి దూరంగా ఉండే ప్రయత్నం చేశాను.
కానీ, మంచి మనసు ఉన్న అతడు కొందరితో కలిసి నా వద్దకు వచ్చి సారీ చెప్పాడు. తనకు బాగా దగ్గరైన వారికి మెడికల్ ఎమర్జెన్సీ ఉందని తెలిసి ఆ రోజు విశాల్ మీటింగ్ కు హాజరవలేదని తెలుసుకున్నాను. నేను చాలామంది హీరోలతో పని చేశాను. వారిలో కార్తిక్ నాకు అన్నయ్య లాంటివారు. విశాల్ తమ్ముడిలాంటి వాడు అని అన్నారు. ఇకపోతే మదగజరాజ సినిమా విషయానికి వస్తే.. 2013లో పూర్తి అయిన ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.