Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. రిలీజ్ రోజున సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగగా అందులో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ని అరెస్టు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ విషయం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆ తర్వాత ఈ విషయంలో అల్లు అర్జున్ చాలానే చేయలేదు కట్టినారు ఎదురయ్యాయి.
అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం చంచల్ గూడ నుంచి విడుదల అయ్యారు. ఇటీవల బన్నీకి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది. హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ తీవ్ర భావోద్వేగానికి గురైంది. బన్నీ అరెస్ట్ సమయంలో ఆయనను హత్తుకుంది. ధైర్యంగా ఉండమని భార్యకు అల్లు అర్జున్ భరోసా ఇచ్చి పోలీసుల వెంట వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ వివాదం సమయంలో స్నేహారెడ్డి ఏమైనా స్పందిస్తుందా అని అభిమానులు ఎంతో ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆమె స్పందించింది. ఈ వివాదం తర్వాత ఆమె తొలిసారి పోస్ట్ చేసింది స్నేహ రెడ్డి.
బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్ లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో తన పిల్లలు అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అరెస్ట్ తర్వాత ఆమె చేసిన తొలి పోస్ట్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్ట్ పై అల్లు అర్జున్ అభిమానులు స్నేహ రెడ్డి అభిమానులు స్పందిస్తూ ఏం కాదు మేడం బి స్ట్రాంగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.