కలలో గణపతి విగ్రహం కనిపించటం దేనికి సంకేతమో తెలుసా…?

మన హిందూ సంప్రదాయంలో స్వప్న శాస్త్రానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చే కలలు మన జీవితంలో జరిగిపోయే విషయాల గురించి ముందే సూచిస్తాయి. సాధారణంగా మనిషి నిద్రపోయినప్పుడు ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. మన భవిష్యత్తులో జరిగే కొన్ని విషయాల గురించి ముందే కలల రూపంలో మనకి తెలిసిపోతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో మనకు పీడ కలలు వస్తూ ఉంటాయి. ఇలా కలలు రావడానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అయితే కలలో గణపతి కనిపించడం వల్ల మన జీవితంలో జరిగిపోయి కొన్ని సంఘటనలు జరుగుతాయని సంకేతం. కలలో వినాయకుడు కనిపించడం దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నిద్రపోయినప్పుడు మీ కలలో గణపతి కనిపించటం శుభప్రదంగా భావించవచ్చు . విజ్ఞాలను తొలగించే గణపతి తనలో కనిపించడం వల్ల శుభం జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కలలో వినాయకుడు కనిపించడం వల్ల మీ జీవితంలో మంచి జరుగుతుందని భావించవచ్చు. అయితే మీకు కల వచ్చిన సంగతి ఎవరితోనూ చెప్పకూడదు. అలాగే కుటుంబ సమేతుడైన గణేశుడు మీ కలలో కనిపించటం అనేది మీ కుటుంబంలో కలహాలు తొలగిపోయి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారని తెలిపే సంకేతం. అలాగే గణపతి ఎలుక పై ప్రయాణిస్తున్నట్లు కళ వస్తే మీరు తొందరలోనే యాత్రలకు వెళతారని తెలిపే సంకేతం.

బ్రహ్మముహూర్తంలో మీకు కలలో గణపతి కనిపిస్తే శుభ పరిణామంగా భావించవచ్చు. ఇలా కల రావడం వల్ల జీవితంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే విఘ్నేశ్వరుని పూజిస్తున్నట్లు కల వస్తే శుభసంకేతంగా మనం భావించవచ్చు. ఇలా కల రావడం వల్ల మీరు చేపట్టిన పనులలో ఎదురైన విజ్ఞాలు తొలగిపోయి
త్వరలోనే మీరు కోరిన కోరికలు నెరవేరబోతున్నాయని అర్థం. అలాగే ఏదైనా పనులు అనుకున్నప్పుడు ఆటంకాలు ఏర్పడి నిలిచిపోతే వెంటనే ఆ పనులు పూర్తవుతాయి. అలాగే కలలో వినాయకుడి నిమజ్జనం చేస్తున్నట్లు వస్తే మాత్రం అది అశుభానికి సంకేతంగా భావించాలి. ఇలా కల రావటం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలాంటి కల వచ్చినప్పుడు బుధవారం రోజున గణపతిని పూజించాలి.