సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోషల్ మీడియాలోమార్ఫింగ్ పోస్టుల కేసులో పోలీసులు అరెస్టు చేస్తారని భయంతో ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కి హాజరు కావలసి ఉంది కానీ ఆయన హాజరు కాకపోవటంతో ప్రకాశం జిల్లా పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వర్మను అరెస్టు చేసేందుకు హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ విషయం పక్కనపెడితే రామ్ గోపాల్ వర్మ ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా రాజ్యమేలుతున్న వేళ.. డాన్లను కూడా లెక్కచేయకుండా సినిమాలు తీశాడు.
రాయలసీమ ఫ్యాక్షనిస్టుల విషయంలో సినిమాలు తీసి కూడా థ్రెట్‌ను ఫేస్ చేశారు. అలా ఎన్నో విషయాల్లో కార్నర్ అయిపోయిన పరిస్థితి వచ్చినా తన చాకచక్యంతో ఎస్కేస్ అవుతూ ఎక్కడా దొరక్కుండా తప్పించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఒకే ఒక కేసు డేరింగ్ అండ్ డాషింగ్ వర్మను భయపెడుతోంది. సినిమాల పరంగా ఎన్నో ప్రయోగాలు చేసిన ఆర్జీవీ వైసీపీకి సపోర్ట్‌గా.. చంద్రబాబు, లోకేశ్, పవన్ టార్గెట్‌గా సినిమాలు తీయటం, వారిపై సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టడంతో ఇరకాటంలో పడిపోయారు. ఈ విషయంగా ఆయనపై కేసు నమోదు అవ్వడంతో మొదట విచారణకు హాజరుకావడానికి టైం అడిగిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు.
ఇంటికి వెళ్తే అక్కడ కూడా లేకపోవడం గమనార్హం.అయితే రాంగోపాల్‌వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ముంబై మాఫియానే లెక్కచేయని వర్మ..ఇప్పడు ఒక చిన్న కేసుకే ఇలా షేక్ అయిపోవడం మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
తాను ఎవరికీ భయపనని గొప్పగా చెప్పుకునే ఆర్జీవీ.. ఇలా 41ఏ నోటీసులకే భయపడటం ఏంటంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఆర్జీవీ ఇంత పిరికోడా అని తెగ ట్రోల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు పెద్దలతో ఆర్జీవికి ఉన్న సన్నిహిత సంబంధాలు అతడిని కాపాడతాయేమో అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్జీవి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సిందే.