నటుడు శ్రీ తేజ్ పై చీటింగ్ కేసు.. నిజా నిజాలు తెలిసేదప్పుడే!

సినీ నటుడు శ్రీతేజ్ పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని మొదట గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. దీంతో బిఎన్ఎస్ 69, 115 (2),318(2) అనే మూడు సెక్షన్లో పోలీసులు కేసు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శారీరక వేధింపులతో పాటు 20 లక్షల నగదు కూడా తన నుంచి తీసుకున్నట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో కూడా ఒక బ్యాంకు ఉన్నతాధికారి భార్యతో శ్రీ తేజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విషయం తెలుసుకున్న భర్త గుండెపోటుతో మృతి చెందగా అతని కుటుంబ సభ్యులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శ్రీ తేజ్ పై ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఎవరు ఈ శ్రీతేజ్ అంటే ఆర్జీవి తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు నాయుడు పాత్ర పోషించాడు.

తరువాత అల్లు అర్జున్ సినిమా పుష్ప లో శ్రీతేజ్ సహాయ నటుడిగా నటించాడు. వీటితోపాటు దళారీ, మంగళవారం, రావణాసుర వంటి సినిమాలలో కూడా నటించాడు. పరంపర, 9 అవర్స్, బహిష్కరణ వంటి సిరీస్ లలో కూడా నటించి మెప్పించాడు. ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకొని కెరియర్ లో నిలదొక్కుకుంటున్న శ్రీతేజ్ వరుస కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. కొందరు దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీలు నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టారనే కారణంతో ఇప్పటికే వందల కేసులు నమోదయ్యాయి. కూడా ఆర్జీవి సినిమాలో చంద్రబాబునాయుడుగా నటించడం కారణంగా అతనిపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియాలంటే శ్రీ తేజ్ నోరు విప్పాల్సిందే.