స్టైలిష్ లుక్స్ తో దుమ్ము రేపుతున్న నాగార్జున.. నిజంగా నవ మన్మధుడే!

అక్కినేని నాగార్జున.. ఈ పేరుకి ఇంట్రడక్షన్ అవసరం లేదు అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున తండ్రి పేరుని నిలబెడుతూ తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఇండస్ట్రీలో టాప్ హీరోలలో స్థానం సంపాదించుకున్నాడు. అతని హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అమ్మాయిలందరూ అతని అందానికి ఫిదా అయిపోతారు. ఆరు పైదల వయసులో కూడా తరగని అతని అందం మగవాళ్ళని సైతం ఆకర్షింప చేస్తుంది. మన్మధుడు అనే టైటిల్ అతనికే కరెక్ట్ అనిపిస్తుంది.

టాలీవుడ్ లో ఓ రకంగా ఫ్యాషన్ కి ట్రెండ్ సెట్టర్గా నిలిచాడు నాగార్జున.ఈ వయసులో కూడా మంచి స్టైలిష్ లుక్స్ తో కుర్ర హీరోలకి పోటీ చేస్తున్న నాగార్జున ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫోటోలోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అలాగే రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నాగార్జున కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యాయి. టీల్ గ్రీన్ షర్ట్, బ్లూ జీన్ ప్యాంట్, బ్రౌన్ లెదర్ షూస్ సూపర్ స్టైలిష్ గా కనిపించాడు నాగార్జున.

ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో అతని స్టైల్ కన్నా అతని సిక్స్ ప్యాక్ ని అతని హెయిర్ స్టైల్ ని పొగిడేస్తున్నారు నెటిజెన్స్. ఒకప్పటి శివ లా కనిపిస్తున్నాడు అంటూ కితాబునిస్తున్నారు. ఈ వయసులో కూడా నాగార్జున సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు మరోవైపు బిగ్ బాస్ కి యాంకర్ గా తనదైన ముద్ర వేసి శభాష్ అనిపించుకున్నాడు.

మరోవైపు బిజినెస్లు కూడా చూసుకుంటూ తెగ బిజీగా ఉన్నాడు నాగార్జున. ప్రస్తుతం కొడుకు నాగచైతన్య పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో ఆ బిజీలో ఉన్నాడు నవ మన్మధుడు. లేజీగా రోజులు గడిపేసే ఈ తరం కుర్రకారు కి నిజంగా నాగార్జున డెడికేషన్ ఒక ఇన్స్పిరేషన్. ఇక సినిమాల విషయానికి వస్తే రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో స్పెషల్ రోల్ చేయటంతో పాటు కుబేర సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు నాగార్జున.