సిద్ధార్థ్, ఆశికా రంగనాథ్ జంటగా ఎస్ రాజశేఖర్ దర్శకత్వంలో శామ్యూల్ మాథ్యూ నిర్మించిన చిత్రం మిస్ యు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తుంది. ఈ సినిమా నవంబర్ 29న తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం హైదరాబాదులో ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు.
ఈ ప్రెస్ మీట్ లో హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి నాకు చాలా ఇంపార్టెంట్ 20 సంవత్సరాల క్రితం సంక్రాంతికి నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాను, ఇప్పుడు తెలంగాణ అల్లుడుగా ఈ సంక్రాంతికి వస్తున్నాను. తన జీవితంలోకి అదితి రూపంలో దేవత వచ్చిందని ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానని, 2024 లో ఏదైనా మంచి జరిగిందంటే అది తన పెళ్లి అని ఆనందం వ్యక్తం చేశారు.
సినిమా గురించి మాట్లాడుతూ నిజానికి లవ్ స్టోరీస్ కి దూరంగా ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్న నాకు డైరెక్టర్ రాజశేఖర చెప్పిన కథ నచ్చటంతో ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో హింస, నెగిటివిటీ, విలన్స్, అసూయ ఏమి ఉండవు.ఈ ప్రపంచంలో నచ్చని అమ్మాయిని ప్రేమించే అబ్బాయి కధ ఇది. 12 సంవత్సరాల తరువాత ఈ సినిమాతో వస్తున్నాను ఈ సినిమా విజయం సాధిస్తేనే మళ్ళీ లవ్ స్టోరీస్ తీస్తాను అని చెప్పాడు.
గత పది ఏళ్లలో నిర్మాతగా మారాను, వేరువేరు జోనర్స్ లో సినిమాలు చేశాను. స్టార్ అవ్వటం నా డ్రీమ్ కాదు నేను చనిపోతే ఒక మంచి నటుడిని కోల్పోయాము అని అనిపించుకోవాలి అని చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్ . ఇక ఆషికా రంగనాథ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో ఇండిపెండెంట్ గర్ల్ గా కనిపిస్తాను, కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చేలాగా ఉంటుందని చెప్పింది. ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్గా ఉన్నామని దర్శకుడు రాజశేఖర్ చెప్పారు.