టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ళ త్వరలోనే ఒక ఇంటి వారవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. వీరి పెళ్లి చాలా సింపుల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు జరగబోతుందని, కేవలం 300 మంది అతిధుల సమక్షంలో చాలా సింపుల్ గా చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ మధ్యనే నయనతార తన పెళ్లి, కెరియర్ పై డాక్యుమెంటరీ తీసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ డాక్యుమెంటరీ సృష్టించిన వివాదాలు కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు నయనతార దంపతుల బాటలోనే నాగచైతన్య దంపతులు కూడా వాళ్ల పెళ్లి ని ఒక డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయంట.
ఈ డాక్యుమెంటరీలో నాగచైతన్య కెరియర్ అలాగే వ్యక్తిగత జీవితంలో తనకు ఎదురైన ఇబ్బందులు, శోభితతో పరిచయం, వారిద్దరి ప్రేమ, పెళ్లి గురించి ఈ డాక్యుమెంటరీలో చూపిస్తారంట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు అయిన నెట్ఫ్లిక్స్, అమెజాన్ లు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇక నాగచైతన్య తన పెళ్లి గురించి మాట్లాడుతూ మా పెళ్ళి వేడుకల్లో ఎలాంటి ఆర్బాటాలు ఉండవు.
మా తాతగారి విగ్రహం ఎదురుగానే మా వివాహం జరుగుతుంది, ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలనే ఉద్దేశంతోనే ఇరు కుటుంబాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. శోభితతో నేను ప్రారంభించబోయే కొత్త జీవితం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను, ఆమె నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని పూడుస్తుందని గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చాడు చైతన్య. అయితే వీరి వివాహం డిసెంబర్ 4న జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.