Harish Rao: విరాళం తిరిగి ఇచ్చావు… అదానీతో ఒప్పందం సంగతి ఏంటి: హరీష్ రావు

Harish Rao:యంగ్‌ ఇండియా స్కిల్స్‌ వర్సిటీకి అదానీ గ్రూప్‌ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నట్లు సీఎం రేవంత్‌ ప్రకటించారు.అదానీ సమస్థల అధినేత ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా 1700 కోట్ల వరకు విరాళంగా డబ్బును అందుకున్నారని జగన్ పై కూడా విమర్శలు రాగ మరోవైపు రేవంత్ రెడ్డి కూడా 100 కోట్ల విరాళం అందుకున్నారంటూ విమర్శలు వచ్చాయి.

ఈ విధంగా అదానీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు అయితే ఏపీలో అదానీతో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒప్పందాలన్నింటిని రద్దు చేయాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి షర్మిల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే సిల్క్ యూనివర్సిటీ కోసం అదానీ నుంచి తీసుకున్న 100 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విధంగా రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఈ విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.అదానీ విరాళం తిరస్కరించారు సరే.. మరి ఒప్పందాల సంగతేంటని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. దావోస్‌లో అదానీతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటి? డిస్కంలను అదానీ సంస్థల పరం చేస్తున్న కుట్రల మాటేమిటి? 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామని అదానీ వస్తే మేం మర్యాదగా తిరస్కరించాం. కానీ, కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. అదానీ అవినీతి బయటకు రాగానే ఆయన వద్ద నుంచి తీసుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఒప్పందాలను మాత్రం రద్దు చేసుకున్నట్లు తెలపలేదని, అదానీతో చేసుకున్న ఒప్పందాలు అన్నింటినీ కూడా రద్దు చేయాలి అంటూ బిఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు.