సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ తో చెర్రీ మేకోవర్.. అభిమానుల్లో పెరిగిపోతున్న క్యూరియాసిటీ!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ తార జాన్వి కపూర్ హీరోయిన్ గా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అర్ సి 16 వర్కింగ్ టైటిల్ తో సినిమా భారీ అంచనాల మధ్య ఇటీవలే బెంగళూరులో షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం నుంచి రాంచరణ్ మీద సీన్లు తీయబోతున్నాడు బుచ్చిబాబు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు. రూరల్ అండ్ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న సినిమా కావడంతో రామ్ చరణ్ అందుకు తగ్గ కసరత్తులు చేసి రెడీ అయ్యాడు.

లేటెస్ట్ గా డైరెక్టర్ బుచ్చిబాబు ఆర్సి 16లో చరణ్ కొత్త లుక్ ని ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ తో డిజైన్ చేయిస్తూ ఫోటో షేర్ చేశాడు. సాలిడ్ మేకవర్ తో రామ్ చరణ్ ఎప్పుడు ముందుంటాడు,. నెవర్ బిఫోర్ మాస్ లుక్కు లోడింగ్.. చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఏర్పడింది. హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ అంటే అతను బాలీవుడ్ తో పాటు సౌత్ స్టార్స్ కి కూడా హెయిర్ స్టైల్స్ చేస్తూ ఉంటాడు.

ఈ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ కేవలం ఆర్టిస్టులకు మాత్రమే కాకుండా ఎంఎస్ ధోని, కోహ్లీ వంటి ప్రముఖులకు కూడా హెయిర్ స్టైల్ చేస్తాడు. అందుకే ఆయన తీసుకునే ఫీజు కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది.అలాంటి సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఇప్పుడు రామ్ చరణ్ కి కొత్త లుక్ ఇచ్చారనే వార్త సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేస్తోంది.

వీలైనంత త్వరగా ఆర్సి 16 సినిమా షూటింగ్ పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాబట్టి ఫస్ట్ లుక్ రివిల్ కి పెద్దగా సమయం తీసుకుని ఛాన్స్ లేదు. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు తెలుగు సీనియర్ నటుడు జగపతిబాబు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.