YS Jagan: 50 రోజులపాటు జనంలోనే జగన్… రోడ్ మ్యాప్ సిద్ధం… పర్యటన ఎక్కడంటే?

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు ఈ క్రమంలోనే ఈయన మీడియా సమావేశాలలో భాగంగా అసెంబ్లీలో జరిగిన సమావేశాల గురించి అధికార నేతలను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఈయన ఇదివరకే ఘాటుగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఇక ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తద్వారా ప్రజలు ఇబ్బంది పడడమే కాకుండా ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని జగన్ తీవ్ర స్థాయిలో తప్పుపడుతూ వచ్చారు. ఇక కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల పాటు సమయం ఇచ్చిన ఈయన త్వరలోనే ప్రజలలోకి రాబోతున్నారని తెలుస్తోంది.

ఇలా 50 రోజులపాటు జనంలోనే ఈయన కొనసాగుతూ పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా కలవబోతున్నారని సమాచారం ఇప్పటికే ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశారని తెలుస్తుంది. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు పర్యటించనున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గం స్థానాలలో ఈయన పర్యటించబోతున్నారని ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నేతలతో కూడా భేటీ కాబోతున్నారని తెలుస్తోంది.

ఇలా జగన్ జనంలోకి రావడం వల్ల పార్టీ కార్యకర్తలను నాయకులను కలవడమే కాకుండా గ్రౌండ్ లెవెల్ లో చంద్రబాబు నాయుడు పాలన విధానం ఏంటి ప్రజల అభిప్రాయం ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారని అయితే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ తరువాత ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది.