ట్విట్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ కార్తికేయన్.. ఓ వెర్షన్ లో అది నిజమే అంటున్న నెటిజన్స్!

టీవీ యాంకర్ గా కెరియర్ ప్రారంభించి ఇప్పుడు కోలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివ కార్తికేయన్. రీసెంట్ గా అతడు నటించిన అమరన్ చిత్రం 300 కోట్ల క్లబ్ లో చేరటంతో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ రేంజ్ ఉన్న ఆగ్ర హీరోల జాబితాలో చేరిపోయాడు.

అయితే ఈ మధ్యన గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శివ కార్తికేయన్ సోషల్ మీడియా గురించి వైరల్ కామెంట్స్ చేశాడు. సోషల్ మీడియా కి దూరంగా ఉండండి, ముఖ్యంగా ట్విట్టర్ కి చాలా దూరంగా ఉండండి. ఈ విషయం చెప్పినందుకు ఎలన్ మస్క్ నన్ను బ్లాక్ చేసినా సరే కొన్ని సంవత్సరాలుగా నేను ఇదే ఫాలో అవుతున్నాను. సాధారణంగా నా సినిమా ఎప్పుడైనా పరాజయం పొందితే సోషల్ మీడియా చూసి తప్పులు సరి చేసుకునేవాడిని.

అయితే ఈ మధ్య సోషల్ మీడియా వాడుతుంటే ఫెయిల్ అయిన సినిమాలకు ఫలితం ఇవ్వకపోగా నెగిటివిటీ ని మరింత పెంచిందని చెప్పుకొచ్చారు. నేను టీవీ యాంకర్ గా ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఎక్కువ లేకపోవడంతో అప్పుడు ఏమైనా తప్పులు చేస్తున్నానా అనే ఫీడ్ బ్యాక్ తీసుకునేవాడిని కానీ ఇప్పుడు ఎక్స్ లో అలా లేదు అందుకే బ్యాక్ టు బేసిక్స్ సూత్రాన్ని పాటించాను. దీంతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. శివ కార్తికేయన్ వెర్షన్ లో చూస్తే ఒకరకంగా ఇది కరెక్టే.

అక్కర్లేని తప్పుడు సమాచారం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఏది రైట్ ఏది రాంగ్ అని గుర్తించలేని పలువురు నెటిజన్లు అనవసరమైన వ్యవహారాలలో తల దూర్చి ఇబ్బంది పడుతున్నారు. ట్విట్టర్ వాడకంలో బోలెడంత మంచి ఉంది కానీ దాన్ని వాడుకునే నేర్పు లేకపోతే దానిని వాడకపోవడమే మంచిది. ఇక అమరన్ సినిమా విషయానికి వస్తే హిట్ అవుతుందనుకున్న సినిమా అంతకుమించి రికార్డులు సృష్టించటం నిజంగా అభినందించదగ్గ విషయం.