KTR: ఎవరు అధైర్య పడొద్దు… ఇకపై మేం చూసుకుంటాం వారికి భరోసా ఇచ్చిన కేటీఆర్?

KTR: తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడుతున్నారు. ఇలా ఎప్పటికప్పుడు ఈయన ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే సోషల్ మీడియా వేదికగా అలాగే మీడియా సమావేశాలలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా మరోసారి ప్రభుత్వ తీరుపై ఈయన మండిపడ్డారు.

గత కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు అలాగే గురుకుల పాఠశాలలోని విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు రేవంత్ రెడ్డికి ఏమాత్రం పట్టడం లేదని తెలిపారు.గురుకుల విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కనీసం విద్యార్థుల ఆత్మహత్యలపై గురుకుల విద్యార్థుల పరిస్థితిపై ఈయన సమీక్షలు కూడా చేపట్టలేదని విమర్శించారు.

ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయం.. ఆ కుటుంబాల తరపున శాసన సభలో కూడా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని తెలిపారు.కష్టాలు వచ్చాయని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ధైర్యంగా ఉండండి అని కోరారు. ఆరోగ్యం బాగాలేకపోతే తాము ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పిస్తాం. బీఆర్ఎస్‌ను సంప్రదించండి అని ఈయన గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు అలాగే తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు భరోసా కల్పించారు.

ఇక నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమంలో చాలా ఫ్రస్టేషన్ నిరాశతో మాట్లాడారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విషయంలో రాహుల్ గాంధీ తనకు పెట్టిన చివాట్ల కారణంగా ఎప్పుడు ఎక్కడే మాట్లాడాలో తనకు అర్థం కాకుండా పోయిందని కేటీఆర్ విమర్శించారు. నిన్న ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత చిట్టి నాయుడికి చెప్ దొబ్బినట్లు అనిపించిందని రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.