Roja మళ్లీ సినిమాలలో నటిస్తారా… షాకింగ్ సమాధానం చెప్పిన వైకాపా మాజీ మంత్రి?

1220017-roja

Roja సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకుని తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా అనంతరం గోలీమార్ మొగుడు వంటి సినిమాలలో తల్లి అత్త క్యారెక్టర్లలో నటించిన సంగతి తెలిసిందే. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో నటించిన ఈమె రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇలా దాదాపు 8 సంవత్సరాలపాటు ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాల పాటు మంత్రిగా కూడా రోజా కొనసాగారు ఇక ఎమ్మెల్యే అయినప్పటికీ బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసేవారు అలాగే జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా కూడా వ్యవహరించారు. ఇక మంత్రి అయిన తర్వాత తనపై జబర్దస్త్ కార్యక్రమంలో నుంచి తప్పుకుంటున్నాను అని రోజా జబర్దస్త్ కార్యక్రమం నుంచి కూడా బయటకు వచ్చేసారు. ఇలా బయటకు వచ్చిన ఈమె రాజకీయ కార్యకలాపాలలో ఎంతో బిజీ అయ్యారు.

ఇకపోతే గత ఎన్నికలలో కూడా నగరి నియోజకవర్గంలో నుంచి రోజా పోటీ చేశారు రోజా తో పాటు తన పార్టీ కూడా పరాజయం పాలైన విషయం తెలిసిందే ఇక ఈ ఎన్నికలలో రోజా కూడా ఓడిపోవడంతో ఈమె తిరిగి సినిమాలలోకి రావాలనే ప్రయత్నాలు చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజాకు ఇదే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు రోజా సమాధానం చెబుతూ తాను తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని కోరుకుంటున్నాను అయితే బాహుబలి సినిమాలో శివగామి పాత్రలాగా అత్తారింటికి దారేది సినిమాలో అలాంటి ఒక అత్త క్యారెక్టర్ లోను లేదంటే డాక్టర్ లాయర్ వంటి పాత్రలలో నటించాలని ఉంది అంటూ ఈమె తన మనసులో కోరికను బయటపెట్టారు. ఈ విధంగా రోజ తిరిగి సినిమాలలోకి రావాలని గట్టిగానే కోరుకుంటున్నారు మరి ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయా డిప్యూటీ సీఎం ఈమెకు అలాంటి అవకాశాలను కల్పిస్తారా అనేది తెలియాల్సి ఉంది.