ఈ క్వాలిటీస్ ఉంటే లీడర్ అవుతారు.. ఆకట్టుకుంటున్న పూరి జగన్నాథ్ మ్యూజింగ్స్!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ డబల్ ఇస్మార్ట్ సినిమా ఫ్లాప్ తర్వాత చాలా రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఒకప్పుడు పూరీ జగన్నాథ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విజయాలని అందుకున్నాయి. ఆయన స్పీడ్ కి రాజమౌళి లాంటి దర్శక దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయేవారు. అయితే గత పదేళ్ల కాలంలో ఆయన చేసిన సినిమాల్లో ఒకటి రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి మిగిలినవి బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచినవే.

అయితే ఈ మధ్య పూరి మ్యూజింగ్స్ పేరుతో తన పాడ్ కాస్ట్ లో వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు. వీటిని ఆయన తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. తాజాగా ఆయన ప్లే ఫూలిష్ అనే కొత్త కాన్సెప్ట్ మరో మ్యూజింగ్ ని విడుదల చేశారు. ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వటానికి చాలామంది సైకాలజిస్టులు చెప్పే థియరీ ప్లే ఫూలిష్. అంటే మీకంటే అనుభవజ్ఞులు ముందు మీ కంటే సీనియర్స్ ముందు మీకు ఏమీ తెలియనట్లుగా ఉండటమే ప్లే ఫూలిష్.

ఈ స్టేటజీ మీరు ఇంకా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి చెప్పే మాటలు వినడం నేర్చుకుంటే మనం ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనే విషయాలు అర్థమవుతాయి. మీ పోటీ దారులని ఎప్పుడూ మీరు శత్రువులుగా చూడకండి, వారిని మెంటార్స్ గా మాత్రమే భావించండి. ఎదుటి వ్యక్తులతో వాదించడం మానేసి జీనియస్ గా వ్యవహరించండి.

నువ్వు తక్కువ నాలెడ్జి ఉన్న వ్యక్తిగా అవతలి వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు నీపై ఫోకస్ పెట్టరు, నిన్ను ఇబ్బంది పెట్టరు అలాగే నీవల్ల వాళ్లకి ఎలాంటి పోటీ, ఇబ్బంది ఉండదని ఫీల్ అవుతారు అప్పుడు వాళ్ళ స్టేటజీ లు మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది.సోక్రటీస్ నాకు తెలిసింది ఏమిటంటే.. ఏమీ తెలియదు అని చెప్పాడు.మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి అబ్రహం లింకన్ కూడా అలాగే ఉండేవాడంట. ప్లే ఫూలిష్ ఆర్ట్ లో మాస్టర్ అయితే మీరు లీడర్ గా మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్.