మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. కొన్నిసార్లు గుండె వేగంగా పెరగడం వల్ల మనలో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువ ఒత్తిడి ఫీలైనా, నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నా కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. విటమిన్ డి లోపంతో బాధ పడేవాళ్లను సైతం గుండె సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
థైరాయిడ్ సమస్యతో బాధ పడేవాళ్లను సైతం గుండె సంబంధిత సమస్యలు వేధించే ఛాన్స్ ఉంది. అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నా రక్త హీనత సమస్యతో బాధ పడుతున్నా గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. గుండె దడ వల్ల నీరసం, ఊపిరి సరిగ్గా ఆడకపోవడం, చెమట సంబంధిత సమస్యలు వేధిస్తాయి. వ్యాయామం చేయడంతో పాటు డైట్ పాటించడం కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు.
అయితే గుండె వేగం మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. గుండె విషయంలో ఎలాంటి సమస్య వచ్చినా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గుండె విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని వైద్యులు సైతం చెబుతున్నారు.
ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తరచూ గుండె నొప్పి ఉన్నవాళ్లు మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.