Pawan Kalyan: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసుల కేసు నమోదు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా గతంలో కూటమి నేతలను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు చేయడంతో ఈయనపై కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఈయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటికే వర్మ పోలీస్ విచారణకు హాజరు కావలసి ఉండగా ఆయన సినిమా షూటింగ్ పనులలో ఉన్న నేపథ్యంలో విచారణకు రాలేనని పోలీసులకు తెలియజేశారు. ఇకపోతే వర్మ మీద నమోదు అయినటువంటి కేసు కొట్టి వేయాలని కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కూడా ఈయన పిటిషన్ ను కొట్టివేసింది. ఇక అరెస్ట్ భయంతో ఈయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇక నేడు విచారణ జరగాల్సిన ఈ బెయిల్ పిటీషన్ రేపటికి వాయిదా పడింది.
ఇలా వర్మకు ముందస్తు బెయిల్ కూడా లేకపోవడంతో పోలీసులు తనని అరెస్టు చేస్తే తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారని వర్మ భావించారు. ఈ తరుణంలోనే వర్మ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వర్మ అరెస్టు వివాదం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం ఈయన ఢిల్లీ పర్యటనలో ఉంటూ వివిధ శాఖల కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు.
ఇలా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ కు రిపోర్టర్స్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.గతంలో పోలీసులు ఎక్కడున్నా పట్టుకునేవాళ్లు.. ఇప్పుడు ఆర్జీవీ ఎందుకు దొరకడం లేదు..? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే తరహాలో మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు పవన్ సమాధానం చెబుతూ..
డిప్యూటీ సీఎంగా నేను చేయాల్సిన పనులను నేను చేసుకుంటూ పోతున్నాను ఇక పోలీసులు కూడా వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ను హోం శాఖ చూసుకుంటుంది. ఆ వ్యవహారాలన్నింటినీ నేను చూసుకోవడం లేదు కదా అంటూ ఈయన నవ్వుతూ బదులిచ్చారు. ఇలా వర్మ విషయం గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.