YS sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు. ఇందులో భాగంగా ఈమె చంద్రబాబుకు లేఖ రాస్తూ ప్రస్తుతం అదానీ సంస్థల నుంచి విద్యుత్ ఒప్పందంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఏకంగా 1750 కోట్ల రూపాయలను అందుకున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ విషయంపై ఈమె లేఖ రాశారు.
ఈ సందర్భంగా షర్మిల లేఖ రాస్తూ వైయస్ జగన్మోహన్ రెడ్డి అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు.అక్రమ ఒప్పందంతో ప్రజలపై రూ. 1.50 లక్షల కోట్లు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గౌతమ్ అదానీ నుంచి రూ.1,750 కోట్ల ముడుపులు అందుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గౌతమ్ అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించాడు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయాలని ఈమె కోరారు. ఇకపోతే ఈ ఒప్పందాలను రద్దు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబిఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గురించి విచారణ జరిపించాలంటే షర్మిల రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక షర్మిల గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమె ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమిని కోరుకోవడమే కాకుండా తనని రాజకీయపరంగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారు. ఇక వీరికి వ్యక్తిగత ఆస్తి వివాదాలు ఉన్నట్టు నేపథ్యంలో షర్మిల వైయస్ జగన్ రాజకీయాల పరంగా టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.