పూజా, శుకార్యలలో అరటిపండు ఉపయోగించాడానికి కారణం ఏమిటో తెలుసా…?

సీజన్తో సంబంధం లేకుండా సామాన్యులకు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండే ఏకైక పండు అరటిపండు. ప్రతిరోజు అరటి పండు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పూజా కార్యక్రమాలలో, శుభకార్యాలలో అరటిపండు తప్పనిసరిగా కనిపిస్తాయి. అయితే అరటి పండ్లను శుభకార్యాలలో పూజా కార్యక్రమాలలో ఎందుకు ఉపయోగిస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పురాణ ఇతిహాసాల ప్రకారం..దూర్వాస మహాముని సాయం సంధ్యవేళ ఆదమరచి నిద్రపోతున్నప్పుడు ఆయన భార్య (కదలీ) సంధ్యావందనం సమయం కావడంతో ఆయనను నిద్ర లేపుతుంది. అయితే దుర్వాసుడి ఆగ్రహానికి ఆవిడ భస్మరాశిగా మారిపోతుంది. కొన్నిరోజుల తరువాత దుర్వాస మహర్షి మామగారు తన కూతురు గురించి అడగగా ఆవిడ తన కోపాగ్ని వల్ల భస్మరాశి అయిందని చెప్పి, తన మామ గారి ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు, ఆమెను చెట్టుగా మార్చి, శుభప్రదమైన కార్యాలన్నింటిలో కదలీఫలం (అరటి పండ్లు) రూపంలో వినియోగించబడుతుంది అని వరాన్ని ఇస్తాడు.

అందువల్ల ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా అరటి ఆకులు, అరటి మొక్కలు, అరటి పండ్లు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అలాగే కొన్ని దోష పరిహారాల కోసం కూడా అరటిని ఉపయోగిస్తారు. కుజదోషం ఉన్నవారు అరటిచెట్టుకు చక్కెర కలిపిన నీరు పోసి, తడిసిన ఆ మట్టిని నొసట బొట్టుగా ధరిస్తే దోషం తొలగిపోతుంది. అలాగే అరటినారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అంతే కాకుండా ఆంజనేయస్వామిని ఆరాధించేవారు అరటితోటలో లేదా అరటిచెట్టు కింద స్వామి వారి విగ్రహాన్ని/ పటాన్ని ఉంచి పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.