ఈ మధ్య కాలంలో రక్తపోటు సమస్యతో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్యతో బాధ పడుతున్నారంటే ఈ సమస్య వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో సులువుగానే అర్థమవుతుంది. ఆహారానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా రక్తపోటు సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి.
ఈ మధ్య కాలంలో చాలా మంది సోడియం ఎక్కువగా తీసుకుని పొటాషియమ్‌ని తక్కువగా తీసుకుంటున్నారు. అయితే పొటాషియం ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కూరగాయల్లో పొటాషియం ఎక్కువగా ఉండగా ఆకు కూరలు, టమాటాలు, బంగాళదుంపలు, చిలగడ దుంపలు తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయి.
అరటి పండ్లు, అవకాడో, ఆరెంజ్, మేలన్స్ మరియు ఆప్రికాట్స్‌లో పొటాషియం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే కొంతమంది హై బీపీ సమస్యతో పాటు లో బీపీ సమస్యతో కూడా బాధ పడుతూ ఉంటారు. మైకం, అలసట, తలనొప్పి, కళ్లు తిరగడం, కడుపులో తిమ్మిరి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హృదయ స్పందన రేటు పెరగడం లోబీపీకి కారణమవుతుంది.
సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, చెడు అలవాట్లు ఉండటం వల్ల లో బీపీ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆహారం, జీవన శైలిని మార్చుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. లోబీపీ సమస్య వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.