కామెర్ల వ్యాధి ఎంత ప్రమాదమో తెలుసా.. ఈ వ్యాధికి సులువుగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో కామెర్లు ఒకటి. ఏ వయస్సు వారైనా ఈ సమస్య బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కళ్లలోని తెల్లటి భాగం పసుపుపచ్చ రంగులో మారితే ఆ వ్యాధి కామెర్ల వ్యాధి అని చెప్పవచ్చు. శరీరంలోని ద్రవాలు కూడా పచ్చగా మారడం వల్ల కొన్నిసార్లు మూత్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రక్తంలో బైలిరుబిన్‌ అనే పదార్థం ఎక్కువైతే ఈ సమస్య వస్తుంది.

లివర్ సరిగ్గా పని చేయని పక్షంలో బిలిరుబిన్ అనే వ్యర్థ పదార్థం పేరుకుపోయి కళ్లు, గోర్లు పసుపు రంగులోకి మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ సమస్యతో బాధ పడే వారిలో విపరీతమైన అలసట ఉండటంతో పాటు హఠాత్తుగా జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి. కందుల ఆకు కామెర్లను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆకుల రసాన్ని రోజుకు 60 ఎం.ఎల్ చొప్పున తీసుకుంటే మంచిది.

కాకర ఆకులను నీటిలో మరిగించి కొత్తిమీర ఆకులను సైతం నీటిలో వేసి మరిగించి రోజుకు మూడుసార్లు ఈ నీళ్లను తాగితే అనుకూల ఫలితాలు వస్తాయి. ముల్లంగి ఆకులు గ్రైండ్‌ చేసి రసం తీసుకుని తాగితే తక్కువ సమయంలోనే ఈ సమస్య దూరమవుతుంది. టీ స్పూన్ బొప్పాయి ఆకుల పేస్ట్‌లో తేనె కలిపి తీసుకుంటే వేగంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

తులసి ఆకులను తీసుకుని దానిని పేస్ట్‌లా చేసుకుని సగం గ్లాస్‌ ముల్లంగి రసంలో వేసి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకుంటే మంచిది. కొన్ని ఆహారలకు దూరంగా ఉండటం వల్ల కూడా కామెర్ల సమస్యను దూరం చేసుకోవచ్చు. జంక్ ఫుడ్, శుద్ధి చేసిన చక్కెర, అరటి పండ్లకు కామెర్లతో బాధ పడేవాళ్లు దూరంగా ఉండాలి.