మన హిందూ సంప్రదాయంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. స్త్రీ పురుషులు వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత వారు మరణించేదాకా ఒకరి కోసం ఒకరు జీవిస్తూ ఉంటారు. వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మెడలో మంగళసూత్రం, కాలికి మెట్టెలు, నుదుటిన సింధూరం సౌభాగ్యానికి చిహ్నంగా ధరిస్తూ ఉంటారు. ఇలా ఇవన్నీ ధరించటం భర్త ఆయుష్షుతో ముడిపడి ఉంటుంది. భర్త బ్రతికి ఉన్నంతకాలం ప్రతి స్త్రీ సౌభాగ్యవతిగా ఇవన్నీ ధరించవచ్చు. అయితే భర్త మరణించిన తర్వాత స్త్రీలు మంగళసూత్రం, మెట్టెలు, నుదుటిన సింధూరం ధరించకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. భర్త చనిపోయిన తర్వాత మహిళలు సింధూరం పెట్టుకుంటే ఏం జరుగుతుంది..? దానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• వివాహం జరిగే సమయంలో స్త్రీ నుదుటిపై పురుషుడు సింధూరం దిద్దుతాడు. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి మొదటి పై బొట్టు పెట్టుకున్న కూడా పాపిటిలో మాత్రం పెళ్లి తర్వాతే సింధూరం పెట్టుకుంటారు. అందువల్ల భర్త చనిపోయిన స్త్రీలు నుదుటిపై బొట్టు పెట్టుకున్న కూడా పాపిటలో సింధూరం పెట్టుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
• అలాగే పెళ్లి సమయంలో భర్త మెడలో మాంగళ్య ధారణ చేస్తాడు. ఇలా భర్త బతికి ఉన్నంతకాలం మెడలో స్త్రీలు మంగళసూత్రం ధరించాలి. భర్త చనిపోయిన తర్వాత ఈ మంగళ సూత్రాన్ని స్త్రీలు తీసివేయవచ్చు.
• అలాగే పెళ్లి సమయంలో వరుడు వధువు కాలికి మెట్టెలు తొడుగుతాడు. అందువల్ల భర్త బ్రతికి ఉన్నంతకాలం ప్రతి స్త్రీ కాలికి మెట్టెలు పెట్టుకోవడం సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. భర్త మరణించిన తర్వాత కాలిమెట్టలు కూడా తొలగిస్తారు.
• వివాహ సమయంలో భర్త కట్టిన తాళి, కాలికి పెట్టిన మెట్టెలు, నుదుటిన పెట్టిన సింధూరం భర్త బ్రతికి ఉన్నంతకాలమే ఉంచుకోవాలి. అయితే ఆడపిల్ల జన్మించినప్పటినుండి మొదటి మీద పెట్టుకునే బొట్టు మాత్రం భర్త మరణించిన తర్వాత కూడా పెట్టుకోవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి.