కేంద్రం కొత్త స్కీమ్.. ఈ స్కీమ్ ద్వారా మహిళలు ఏకంగా రూ.15,000 పొందే అవకాశం?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళలకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. మహిళల కొరకు కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో డ్రోన్ దీదీ యోజన ఒకటి కాగా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు ఈ స్కీమ్ ద్వారా డ్రోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. డ్రోన్ల సహాయంతో మహిళా రైతులు పొలాల్లో మందులను పిచికారీ చేయవచ్చు.

2025 2026 ఆర్థిక సంవత్సరం వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ లో చేరిన మహిళలు ప్రతి నెలా గౌరవ వేతనం పొందే అవకాశాలు కూడా ఉంటాయి. 1261 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. గతేడాది నవంబర్ నెల నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. డ్రోన్ సహాయంతో తక్కువ సమయంలో వేగంగా పంట పిచికారీ పూర్తి చేయవచ్చు.

ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకునే మహిళల కోసం కేంద్రం త్వరలో ఆన్ లైన్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం అందుతోంది. ఈ స్కీమ్ ద్వారా మహిళా రైతు నెలకు 15000 రూపాయల గౌరవ వేతనం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఈ స్కీమ్ ద్వారా మహిళా రైతులకు ఉపాధి కూడా లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ అమలు కోసం గరిష్టంగా 8 లక్షల రూపాయల వరకు కేంద్రం నుంచి ఆర్థికంగా సహాయం లభిస్తుందని చెప్పవచ్చు. మిగతా మొత్తాన్ని అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద రుణంగా పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్కీమ్ కింద తీసుకున్న లోన్ కు 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలుతెలుసుకుని దరఖాస్తు చేసుకుంటే మంచిది.