మహిళలకు అదిరిపోయే శుభవార్త ఇదే.. రూ.12 లక్షల వేతనంతో భారీగా ఉద్యోగ ఖాళీలు!

ప్రస్తుత కాలంలో పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తూ మహిళలు సైతం భారీగా వేతనాలను పొందుతున్నారు. మహిళలకు పురుషులతో సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు సైతం ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే మహిళలలో కొంతమంది కొన్ని ఉద్యోగ ఖాళీలను ఎంపిక చేసుకుంటే ఏడాదికి 12 లక్షల రూపాయల వేతనం పొందే ఛాన్స్ ఉంటుంది.

 

మహిళలకు అనుకూలంగా ఉండే రంగాలలో వైద్య రంగం ఒకటి. డాక్టర్ గా కెరీర్ పరంగా స్థిరపడితే మాత్రం మాత్రం ఏడాదికి 12 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. లాయర్ వృత్తిని ఎంచుకున్న మహిళలు సైతం కళ్లు చెదిరే స్థాయిలో సంపాదించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ రంగంలో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయి.

 

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రంగం కూడా మహిళలకు మంచి రంగం అని చెప్పవచ్చు. ఈ రంగంలో కెరీర్ ను ఎంచుకున్న మహిళలు శాస్త్రవేత్తలుగా రాణించడంతో పాటు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. ఫార్మాసిస్ట్ ఉద్యోగ ఖాళీలకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతుండటం గమనార్హం. విమానయాన, అంతరిక్ష రంగాల్లో సైతం మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయి.

 

ఇంటినుంచి ఉద్యోగాలు చేయాలని భావించే వాళ్లకు సోషల్ మీడియా ఉద్యోగ ఖాళీలు మంచి ఆప్షన్ అవుతాయి. మహిళలకు అనుకూలంగా ఉండే ఉద్యోగాలలో మార్కెటింగ్ ఉద్యోగ ఖాళీలు సైతం ఉన్నాయి. ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మహిళలు సులభంగా భారీ ప్యాకేజీలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది.