Breast Feeding: సాధారణంగా చిన్నపిల్లలు పుట్టిన తర్వాత చిన్నపిల్లల విషయంలో తల్లులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మరి ముఖ్యంగా ఆరు నెలల వయసులోపు ఉన్నటువంటి పిల్లలకు సరైన విధంగా పాలు పట్టించడం ఎంతో ముఖ్యం. అప్పటివరకు వారికి కేవలం పాలు మాత్రమే ఆహారంగా ఉంటాయి కనుక ఈ విషయంలో తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే పిల్లలు పాలు తాగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వారి పొట్ట నిండిందా లేదా వారికి సరిపడా పాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్క తల్లి గుర్తించాలి.
మరి బిడ్డకు తల్లిపాలు సరిపడా లభిస్తున్నాయా లేదా అనే విషయాలను ఎలా తెలుసుకోవాలి ఏంటి అనే విషయానికి వస్తే.. పిల్లలకు తల్లులు పాలు తాపించిన తర్వాత నిద్ర పేట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వారికి పాలు సరిపడా వస్తున్నాయా లేదా అనే విషయాన్ని వాళ్ళు చెప్పరు. వారు ఇచ్చే కొన్ని సంకేతాల ద్వారా వీటిని గుర్తించాల్సి ఉంటుంది. పిల్లలు నిద్రపోకుండా మాటికి ఏడుస్తూ ఉన్నారు అంటే వారికి సరిపడ పాలు లేవని అర్థం. ఎప్పుడైతే పిల్లలు తల్లి పాలు తాగిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోతారు లేదా ఆడుకుంటూ ఉంటారో అప్పుడే మీ బిడ్డకు మీ దగ్గర సరిపడా పాలు ఉన్నాయని అర్థం.
ఇలా కాకుండా పాలు తాగినప్పటికీ నిద్రపోకుండా అరుస్తూ ఉన్నారు అంటే వారికి పాలు సరిపడలేదు ఇలా పాలు సరిపడకపోతే పాలు ఉత్పత్తి కోసం సరైన ఆహారం తల్లి తీసుకోవడం ఎంతో ముఖ్యం. తల్లి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాన్ని తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి అధికంగా పెరుగుతుంది. ఇలా మీరు ఎంత పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకున్న పాలు లేవు అంటే ఒకసారి డాక్టర్ ను సంప్రదించి డాక్టర్ సూచనల ప్రకారం పిల్లలకు మార్కెట్లో లభించే పౌడర్ ద్వారా పాలను పట్టించవచ్చు. వీలైనంతవరకు తల్లిపాలు తాపించడానికి ప్రయత్నం చేయాలి తల్లిపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యకరం అనే సంగతి మనకు తెలిసిందే.