మహిళలకు అలర్ట్.. ఈ అలవాట్లు ఉంటే మాత్రం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా?

ఈ మధ్య కాలంలో మహిళలను వేర్వేరు అరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకున్న మహిళలు సైతం ఆరోగ్య సమస్యల బారిన పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. మహిళలను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ ఒకటి కాగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడే మహిళల సంఖ్య పెరుగుతోంది. పురుషులతో పోల్చి చూస్తే మహిళలను ఎక్కువగా ఈ ఆరోగ్య సమస్య వేధిస్తుందని చెప్పవచ్చు.

వ్యాధి ప్రారంభ దశలోనే ఈ క్యాన్సర్ ను గుర్తిస్తే సులువుగా ఈ సమస్య దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. కడుపు దిగువ భాగం వెనుక ఉన్న ఒక అవయవంలో కణితి ఏర్పడితే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలు ఉంటే ఈ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సీటీ స్కాన్ సహాయంతో ఈ వ్యాధిని సులువుగా గుర్తించే ఛాన్స్ అయితే ఉంటుంది.

వెన్ను నొప్పి ఎక్కువగా వేధిస్తుంటే ఈ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే మంచిది. తిమ్మిరితో వెన్నునొప్పి వేధిస్తున్నా కూడా ఈ సమస్య కారణమవుతుంది. తిన్న తర్వాత వెన్ను నొప్పి వేధిస్తున్నా ఈ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కామెర్ల సమస్య ఎక్కువగా వేధిస్తుంటే కూడా ఈ క్యాన్సర్ కావచ్చు. మహిళలు ఏ చిన్న సమస్య వేధించినా వెంటనే పరీక్షలు చేయించుకుంటే మంచిది.

శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ద్వారా ఈ సమస్యలకు సులువుగా చెక్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్యాన్సర్ పేగులోకి పిత్తాన్ని విడుదల చేసే వాహికను అడ్డుకుని ఇబ్బందులు వస్తాయి. మూత్ర, మల సంబంధిత సమస్యలు తరచూ వేధిస్తుంటే వెంటనే క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటే మంచిది.