7న ఎంఎల్ఏలతో సమావేశం..జగన్ పెద్ద ఫిట్టింగ్

ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది. 8వ తేదీన మంత్రివర్గ విస్తరణ పెట్టుకుని 7 వ తేదీన వైసిపి శాసనసభా పక్ష సమావేశం పెట్టుకోవటమే టెన్షన్ కు  కారణం. మంత్రులుగా జగన్ ఎవరిని తీసుకుంటారో ఇంత వరకూ కనీసం లీకుల రూపంలో కూడా బయటకు రాలేదు. ఉన్న మంత్రిపదవులేమో తక్కువ. గెలిచిన ఎంఎల్ఏలేమో చాలా ఎక్కువమంది. దాంతో మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలన్న విషయంలో జగన్ కు కూడా ఇబ్బందే.

సరే ఆ విషయాలను పక్కన పెడితే మామూలుగా మంత్రులుగా తీసుకోదలచుకున్న వాళ్ళని చీఫ్ సెక్రటరీ కార్యాలయం ద్వారా ముందుగా అలర్టు చేస్తారు పలానా రోజుకు అందుబాటులో ఉండమని చెప్పి. కానీ ఇక్కడ అది కూడా జరగలేదు. సరే ఇంకా చాలా రోజులుంది కదా అని అనుకున్నా మరి 7వ తేదీన ఎంఎల్ఏలతో సమావేశం ఎందుకు పెట్టుకున్నట్లు ?

అంటే శాసనసభా పక్ష సమావేశానికి అందరూ ఎలాగూ వస్తారు. మరుసటి రోజే మంత్రివర్గ విస్తరణ కాబట్టి విజయవాడకు చేరుకునే ఎంఎల్ఏలందరూ జగన్ కు అందుబాటులోనే ఉంటారు.  కాబట్టి ప్రత్యేకించి అందుబాటులో ఉండమని కబురు చేయాల్సిన పనిలేదు. అంటే మంత్రివర్గ కూర్పుపై ఎవ్వరికీ ఎటువంటి సమాచారం అందకూడదనే జగన్ ఈ వ్యూహం పన్నినట్లు అనుకుంటున్నారు.

7వ తేదీ సమావేశంలో  మంత్రివర్గ కూర్పు ఎలాగుండబోతోందో చూచాయగా జగన్ వివరిస్తారని అంటున్నారు. క్యాబినెట్లో చోట్టు దక్కని వారికి పరోక్షంగా అనునయింపులుంటాయని కూడా తెలుస్తోంది. కాబట్టి ఎవరికి మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది ? ఎవరికి దక్కదు ? అనే విషయాలను జగన్ చూచాయగా చెప్పనున్నట్లు సమాచారం. చూద్దాం 7వ తేదీన ఏ చెబుతారో ?