అన్ని పార్టీలను దూరం చేసుకుంటున్న పవన్.. ఒంటరి పోరాటం తప్పదా?

గత కొన్నేళ్లుగా టీడీపీ సోషల్ మీడియాలో వైసీపీని టార్గెట్ చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. దేశంలో మరే పార్టీకి లేని స్థాయిలో టీడీపీ సోషల్ మీడియా కోసం ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. సోషల్ మీడియా వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఏ పార్టీపై వచ్చే విమర్శలకు అయినా సోషల్ మీడియా ద్వారా ధీటుగా సమాధానం చెప్పే అవకాశం అయితే ఉంటుంది.

వైసీపీ గత కొన్నేళ్లుగా ఈ విషయంలో వెనుకబడిందని రాజకీయ విశ్లేషకుల నుంచి సైతం విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ విషయంలో ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది. టీడీపీ సోషల్ మీడియాకు షాకిచ్చే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. గతంలో వైసీపీ సోషల్ మీడియా శక్తివంతంగా పని చేయగా ఇప్పుడు మళ్లీ ఆ దిశగా అడుగులు పడుతుండటంతో వైసీపీ అభిమానులు సంతోషిస్తున్నారు.

వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వైసీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ విజ‌య‌సాయిరెడ్డి ఇప్పటికే న‌లుగురు సోష‌ల్ మీడియా రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ల‌ను నియమించడంతో పాటు ప్రతి జిల్లాకు ఒక కన్వీనర్, నలుగురు కో కన్వీనర్లను నియమించారని తెలుస్తోంది. వర్క్ షాప్ లో వీళ్లు చేయాల్సిన విధుల గురించి విజయసాయిరెడ్డి వెల్లడిస్తారని సమాచారం అందుతోంది.

టీడీపీ సోషల్ మీడియాకు ధీటుగా వైసీపీ సోషల్ మీడియా ఉండనుందని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న జగన్ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకుండా గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా సైనికులు ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.