జెండా ఎగురవేసి డాన్స్ చేసిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే (వీడియో)

ఆయన తెలంగాణ అధికార టిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే. జెండావందనం రోజున ఆయన జెండా ఎగురవేసి డాన్స్ చేశారు. జెండా వందనంలో కొత్త స్టయిల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే, ఏమా కథ? స్టోరీ చదవండి. వీడియో చూడండి.

డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రస్తుత స్టేషన్ గన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి కూడా. ఆయన ఏదైనా ముక్కుసూటిగా అనేస్తారు. డైరెక్టుగానే చేసేస్తారు. ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజు స్టేషన్ ఘన్ పూర్ పరిధిలోని జాఫర్ ఘడ్ కోటపై జెండాను ఎగరవేస్తున్నారు. బుధవారం రోజు జెండాను ఎగరవేసిన రాజయ్య ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో డిజె పాటలకు డాన్సు చేశారు. విద్యార్థులతో, నాయకులతో కలిసి ఆనందంగా స్టెప్పులేశారు. కొందరేమో సంతోషిస్తే మరికొందరేమో ఇదేమైనా ఫంక్షనా జెండా ఎగురవేసి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గౌరవంగా ఉండకపోవడం ఏంటని మరికొందరు అనుకున్నారు.