రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే తీపికబురు.. వాళ్లు ఉచితంగా శిక్షణ పొందే ఛాన్స్!

దేశంలో పేదరికంలో ఉన్నవాళ్లు మాత్రమే రేషన్ కార్డ్ ను కలిగి ఉన్నారు. రేషన్ కార్డ్ కలిగి ఉండి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లకు ప్రయోజనం కలిగేలా మరో శుభవార్త వెలువడింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ,ప్రైవేటు రంగ సంస్థలు అడుగులు వేస్తున్నాయని తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతులకు ఎస్బిఐ గ్రామీణ స్వయం శిక్షణ సంస్థ ఉపాధి శిక్షణ కల్పించడానికి సిద్ధమైంది.

మగ్గం వర్క్స్, బ్యూటీ పార్లర్, ఉమెన్స్ టైలర్ రంగంలో శిక్షణ ఇవ్వనున్నారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉండి తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. రేషన్ కార్డ్ ఉన్న మహిళలు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కావడం గమనార్హం. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ ఫోటోలు, బ్యాంక్ పాస్ బుక్, విద్యార్హత సర్టిఫికెట్లతో అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ శిక్షణకు హాజరైన వాళ్లకు ఏప్రిల్ 2వ తేదీ నుంచి శిక్షణ ఇస్తారని సమాచారం అందుతోంది. 9704056522, 9849307873 నంబర్ల ద్వారా ఈ శిక్షణ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. ఈ శిక్షణకు ఎంపికైన వాళ్లకు వసతి సౌకర్యంతో పాటు భోజన సదుపాయంను కల్పించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన యువతులకు ఈ శిక్షణ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

తెల్ల రేషన్ కార్డ్ ఉన్న యువతులు ఈ శిక్షణ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ఈ శిక్షణ గురించి పూర్తిగా తెలుసుకుని శిక్షణ పొంది శిక్షణ అనంతరం ఉపాధిని పొందవచ్చు. రేషన్ కార్డ్ ఉన్న మహిళలకు ఈ ఆఫర్ బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.