Revanth Reddy: కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే రేవంత్ పని… మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోడు గుడ్డు మీద ఈకలు పీకడమే పని అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. ఇటీవల వరంగల్ జిల్లాలో పర్యటించిన హరీష్ రావు పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఎక్కడ కూడా కెసిఆర్ పేరు కనపడకుండా చేస్తానని చెప్పారు అందుకు అనుగుణంగానే ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

కెసిఆర్ 28 అంతస్తుల ఎంజీఎం ఆస్పత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్షం చేసిందని తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రి నిర్వహణ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పారు. యుద్ధప్రాతిపదికన ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేయాలని.. లేకపోతే పోరాటాలు చేస్తామని అన్నారు. ఆస్పత్రి నిర్మాణ పనులను ఆపడం దద్దమ్మ పని అంటూ ఈయన మండి పడ్డారు. ఆస్పత్రి నిర్మాణం ఆపడం ఎందుకని ప్రశ్నించారు.

ఇక కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం వారందరిని తొక్కుకుంటూ వస్తూ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. ఏ పార్టీలో ఉన్నా తొక్కుడు పదవులు పైన ఎక్కడం ఆయన నైజమని విమర్శించారు. ఎల్లకాలం ఇలాంటి సంస్కృతి సాగాదని హరీష్‌రావు హెచ్చరించారు. రేవంత్ క్రూర మృగాల మధ్య నుంచి వచ్చానని కిరాతకంగా వ్యవహరిస్తున్నారు అంటూ హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు రైతులందరూ కూడా రోడ్డున పడ్డారు. కాంగ్రెస్ పాలనలో 41 శాతం క్రైం రెట్ పెరిగిందని గుర్తుచేశారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అంటూ హరీష్ రావు పై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.