ఫేక్ సర్వేలతో టీడీపీ, వైసీపీ రాజకీయాలు.. వాస్తవ సర్వే ఫలితాలు ఇవే!

YCP Vs TDP

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో 2024 ఎన్నికల్లో గెలిచే పార్టీ ఇదేనంటూ కొన్ని పార్టీల పేర్లు ప్రచారంలోకి రావడంతో పాటు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో అంటూ కొన్ని లెక్కలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే కొన్ని సర్వేలలో టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఉంటే మరికొన్ని సర్వేలలో వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. టీడిపీ, వైసీపీ ఫేక్ సర్వేలలో రాజకీయాలు చేస్తుండటం గమనార్హం.

వాస్తవానికి ఏపీలోని చాలా ప్రాంతాల ప్రజలు ఆఫ్ లైన్ లో కానీ, ఆన్ లైన్ లో కానీ ఎలాంటి సర్వేలు జరగలేదని చెబుతున్నారు. కొంతమంది ప్రజలు తమకు ఒక పార్టీ ఇష్టమైనా మరో పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. మరికొన్ని ప్రాంతాలలో అధికార పార్టీకి వ్యతిరేకంగా చెబితే తమకు పథకాలు కట్ అవుతాయని చాలామంది భావిస్తున్నారు. ఫేక్ సర్వేలతో టీడీపీ, వైసీపీ ఒక పార్టీపై మరొకటి ఆరోపణలు చేసుకుంటూ ఉండటం గమనార్హం.

అయితే ఫేక్ సర్వేలను ఎంతలా వైరల్ చేసినా సర్వేల ఫలితాలు ఏ మాత్రం మారవు అనే సంగతి తెలిసిందే. వాస్తవానికి 2024 ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా లేవు. కొన్ని నియోజకవర్గాలలో వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు ఉండగా మరికొన్ని నియోజకవర్గాలలో టీడీపీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది.

జనసేన సొంతంగా పోటీ చేస్తే మాత్రం పెద్దగా ఫలితం ఉండదని చెప్పవచ్చు. అయితే పవన్ తో పొత్తు పెట్టుకున్నా ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీ సీట్లు కేటాయించడానికి టీడీపీ ఆసక్తి చూపడం లేదు. బీజేపీ ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించినా అలా కేటాయించడం వల్ల పెద్దగా ఫలితం ఉండదనే సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో గెలిస్తేనే తమ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తుండటం గమనార్హం.