టిఆర్ఎస్ సభ ట్రాక్టర్ల ర్యాలీని చూస్తుండగా యాక్సిడెంట్ (లైవ్ వీడియో)

టిఆర్ ఎస్ సభకు వస్తున్న  ట్రాక్టర్ల ర్యాలీతో  ఓ వ్యక్తి రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. సభకు భారీగా ట్రాక్టర్లు వస్తుండటంతో పోలీసులు రోడ్డు డైవర్షన్ చేశారు. ఓ వైపు సభకు వస్తున్న ట్రాక్టర్లను అనుమతించడంతో ఉన్న మరో వైపు రోడ్డులో టూ సైడ్ వెళ్లే వాహానాలను అనుమతించారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారింది.

సభకు వస్తున్న ట్రాక్టర్లను  చూస్తూ ఓ యువకుడు రోడ్డు పై బైక్ నడుపుతున్నాడు. తను వెళ్తున్న వే నే కరెక్ట్ అని ఎదురుగా వస్తున్న వాహానాలను మరిచిపోయినట్టున్నాడు. అంతే ఎదురుగా వస్తున్న ఆటోకు గుద్దుకున్నాడు. అంతే అమాంతం గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. అదృష్టవశాత్తూ యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ట్రాక్టర్ల ర్యాలీని సెల్ ఫోన్ లో వీడియో తీస్తున్న ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. యువకుడు ప్రమాదానికి గురైన వీడియో కింద ఉంది చూడండి.