Nikhil: హీరో నిఖిల్ షూటింగ్ లో ఊహించని ప్రమాదం.. భారీగా నష్టపోయిన మూవీ మేకర్స్!

టాలీవుడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. నిఖిల్ చివరగా తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు నిఖిల్. అలాగే కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుసగా స్పై, 18 పేజెస్, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వంటి సినిమాలలో నటించి మెప్పించారు.

ఇది ఇలా ఉంటే అఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ సబ్జెక్టుతో రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో ఒక ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శంషాబాద్‌లో ది ఇండియన్‌ హౌజ్‌ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా వాటర్‌ ట్యాంకర్‌ పేలిపోవడంతో ఒక్కసారిగా లోకేషన్‌ మొత్తం నీటితో నిండిపోయింది. సముద్రం కి సంబంధించిన ఒక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో అనుకోకుండా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలు కాగా మరికొంత మందికి కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. అలాగే అక్కడున్న కెమెరాలు అన్నీ కూడా అన్నిటిలో తడిచి ముద్దయినట్టు తెలుస్తోంది. సెట్ మొత్తం వాటర్ రావడంతో అందరూ ఒక్కసారిగా పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో వారందరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.