Nassar: తెలుగు ప్రేక్షకులకు నటుడు నాజర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. తెలుగులో మంచి మంచి పాత్రలతో పాటు నెగిటివ్ క్యారెక్టర్ లలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆడపాదడపా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాజర్ ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ తన కొడుకుకు జరిగిన యాక్సిడెంట్ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
నా కుమారుడికి 2014లో యాక్సిడెంట్ జరిగింది. నా కుమారుడికి జరిగిన యాక్సిడెంట్ ఎంతో బాధాకరం. అయితే అతడు ఆ ప్రమాదం నుంచి ధైర్యంగా బయటకు వచ్చాడు. అతడు దళపతి విజయ్ కు వీరాభిమాని. తరచూ దళపతిని ఫాలో ఉంటాడు. అలా చేయడమే యాక్సిడెంట్ సమయంలో అతడి జ్ఞాపకశక్తిని నిలిపింది. కోమాలో నుంచి స్పృహలోకి రాగానే మా పేర్లు చెబుతాడేమో అనుకున్నాము. 14 రోజులపాటు కోమాలో ఉన్న నా కొడుకు కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయ్ పేరు చెప్పాడు అని తెలిపారు నాజర్.
వైద్యులు విజయ్ సినిమాలను, పాటలను చూపారు. అతడిలో వచ్చే మార్పులను గమనించాము. ఈ విషయం తెలుసుకున్న విజయ్ మా అబ్బాయిని కలిశారు. అప్పటి నుంచి వాళ్లిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. మా అబ్బాయికి ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని విజయ్ గిఫ్ట్ గా ఇచ్చారు. అందుకే విజయ్ ఎప్పటికీ నాకు ప్రత్యేకం. ఆయన మా జీవితాల్లో ప్రత్యేక పాత్ర పోషించారు అని తెలిపారు. ఈ సందర్భంగా నాజర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే దళపతి విజయ్ విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.