జనసేన ఏపీలో బలపడే ఛాన్స్ లేదట.. పవన్ కే ఆసక్తి లేదంటూ?

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. సిటీలలో మినహా మండలాలలో జనసేన పార్టీ గురించి సామాన్య ప్రజలకు పెద్దగా పరిచయం లేదు. జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ అభిమానులు సహాయ కార్యక్రమాలను చేపడుతున్నా ఆ కార్యక్రమాల వల్ల జనసేనకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలో జనసేన బలపడే ఛాన్స్ లేదని మరి కొందరు భావిస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కొన్నిరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారనే సంగతి తెలిసిందే. అనారోగ్యం వల్ల పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఈ నెల 31వ తేదీన వైజాగ్ లో జనవాణి కార్యక్రమం జరగాల్సి ఉండగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి అప్ డేట్ రాకపోవడం గమనార్హం.

జనసేన కార్యకర్తలకు సైతం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారో లేదో క్లారిటీ లేకపోవడంతో కార్యకర్తలు ఫీలవుతున్నారు. అనారోగ్యం వల్ల పవన్ విశ్రాంతి తీసుకోవడంలో తప్పేం లేదని అయితే ఆ ఆరోగ్య సమస్య గురించి ఎప్పటివరకు విశ్రాంతి తీసుకుంటారనే విషయాలకు సంబంధించి కనీసం జనసేన కార్యకర్తలకు అయినా సమాచారం ఇవ్వకపోవడం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఇదే విధంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో జనసేన బలపడటం అసాధ్యమని చాలామంది చెబుతున్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయడంపై పవన్ కే ఆసక్తి లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ కామెంట్లపై పవన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. రెండు పడవల ప్రయాణం చేయడం వల్లే పవన్ కళ్యాణ్ కెరీర్ కు నష్టం కలుగుతోందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.